TELUGU

వలసవాద కాలం నుండి   భారతీయ నాటకకర్తలు తమ నాటకాల  ద్వారా భారత దేశ వైవిధ్యాన్ని వేడుకగా   జరుపుకున్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మేము   ఎన్నో నాటకాలు వేశాము, మా కళారూపాల ద్వారా సామాజిక రుగ్మతలను రూపుమాపే  ప్రయత్నం చేశాము .
సామాజిక సమానత్వం  మరియు సమ్మిళితత్వం   వైపు మేము నిలబడ్డాం . పితృస్వామ్య  వ్యవస్థకు , బ్రాహ్మిణిజం కు , కుల ఆధిపత్యం కు మరియు అణచివేతలకు  వ్యతిరేకంగా నగారా మ్రోగించాము . భారతదేశ నాటకరంగ కళాకారులకు మత వివక్ష, చౌవినిజం, సంకుచిత ధోరణులు , మరియు అహేతుకతకు వ్యతిరేకంగా నిలబడిన  సుదీర్ఘమైన చరిత్ర కలదు .

అణగారిన వర్గాల నుండి , అణగారిన  వర్గాల అభ్యున్నతి కోసం మాట్లాడుతూనే ఉన్నాం. పాట,నృత్యం,హాస్యం మరియు శోకాల కలయికతో  , మానవ కధలను క్రోఢీకరించి , మేము, దాదాపు నూట యాభై సంవత్సరాలుగా,లౌకిక, ప్రజాస్వామ్య, సమ్మిళిత   భారతదేశం కోసం కలలు కన్నాం.

నేడు, భారతదేశం అనే  భావనే తీవ్రమైన ప్రమాదం లో ఉంది . పాట , నృత్యం  చివరకు నవ్వు కూడా ప్రమాదపు అంచులలో ఉన్నాయి , నేడు మన  ప్రియమైన భారత రాజ్యాంగమే పెను ముప్పులో ఉంది. వాదన, చర్చ మరియు అసమ్మతిని  వ్యక్తపరిచేందుకు వేదిక అవ్వాల్సిన సంస్థలన్నీ తీవ్రమైన సంక్షోభం లో కి నెట్టివేయబడ్డాయి ,తమ  ప్రశ్నలతో అబద్ధాలను బహిర్గతం చేసే గొంతులను మరియు నిజాలను నిర్భయంగా మాట్లాడే వారిని దేశద్రోహులుగా  చిత్రీకరిస్తున్నారు . విద్వేషాలను రగిలించే బీజాలు మన ఆహారపు అలవాట్లలోనూ ,
మన  ప్రార్థనలలో మరియు పండుగలలోకి కూడా ప్రవేశించాయి.

ఈ విద్వేష రాగాలు   మన నిత్యజీవితంలోకి ప్రవేశించడం  పెనుప్రమాద ఘంటికలకు సంకేతం. దీనిని మనమందరం కలిసికట్టుగా అడ్డుకోవాలి .   ..

రానున్న సార్వత్రిక  ఎన్నికలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైనవి.
ఒక ప్రజాస్వామ్యం  లో ప్రభుత్వం ఆ దేశం లో ఉన్న బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం కృషి చేయాలి, అలాగే  ప్రశ్నించేతత్వం , చర్చించే గుణం మరియు బలమైన ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ  సాగించలేదు . కానీ, వీటన్నింటిని ప్రస్తుత ప్రభుత్వం కనుమరుగయ్యేలా చేసింది . ఐదు సంవత్సరాల క్రితo  అభివృద్ధి అనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన బి జే పి
విద్వేష , హింసాయుత రాజకీయాలను ప్రోత్సహించి , హిందుత్వ గూండాలకు   పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం దేశం యొక్క రక్షకుడిగా చిత్రీకరించబడిన వ్యక్తి తన విధానాల ద్వారా లక్షలాది ప్రజల జీవనోపాధి ని నాశనం చేసాడు.  నల్ల డబ్బును తిరిగి తీసుకవస్తానని వాగ్దానం చేసి ఘోరంగా విఫలం అవ్వడమేగాక ,ఈ దేశంలోని పెట్టుబడిదారులు దేశ సంపదను కొల్లగొట్టి దేశాన్ని వదిలి పారిపోతుంటే కేవలం ప్రేక్షక పాత్ర వహించాడు,
అంతేగాక ధనికుల సంపద ఒకవైపు గణనీయంగా పెరుగుతూ ఉంటే మరోవైపు పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారు.

ఈ  దేశ నాటకరంగ  కళాకారులుగా మేము  ఈదేశ ప్రజలకు విన్నవించుకునేదేమనగా , ,మన రాజ్యాంగం , భిన్నత్వం మరియు మన దేశ లౌకిక భావనలను రక్షించుకోవాల్సిన అవసరం   ప్రతిఒక్కరిమీదా ఉంది . ప్రేమ ,దయాగుణం ,సమానత్వం, సామాజిక న్యాయం ఫరిఢవిల్లడం కోసం, మీ విలువైన వోటుని సద్వినియోగం చేసుకొని, చీకటి   మరియు అనాగరిక శక్తులను ఓడించండి.

మా విజ్ఞప్తి ఏమనగా - మతదురాభిమానం , ద్వేషం, మరియు ఉదాసీనత లను  అధికారం నుండి గద్దె దింపడానికి , బిజెపి, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా  ఓటు వేయండి.
బలహీన వర్గాల  సాధికారత కొరకు , స్వేచ్ఛను,పర్యావరణాన్ని  కాపాడుకునేందుకు, శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించేవారికే  ఓట్ వెయ్యండి . లౌకిక ప్రజాస్వామ్యం మరియు సమ్మిళిత భారతదేశం కొరకు ఓటు వెయ్యండి . కలలుకనే స్వేచ్ఛ కోసం ఓటు వెయ్యండి . తెలివిగా ఓటు వేయండి.

Are you a theatre artist? Like to endorse the statement?
Name and Place:

Your Email: (required)

Your theatre credentials and other details : (required)